మొదలైన అగ్ని నక్షత్రం.. వేసవి పరాకాష్ట.. నడిరోడ్లపై ఎండమావులు.. ఈ 25 రోజులూ ప్రాణగండమే
మండువేసవికి పరాకాష్టగా భావించే అగ్ని నక్షత్రం దక్షిణాదిన తమిళనాడులో ప్రారంభమైంది. గత నెలరోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు అసలు పరీక్ష గురువారం నుంచే ప్రారంభమైంది. ఇప్పటినుంచి మే చివరివరకు అంటే 25 రోజులపాటు ప్రజలు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని చె
మండువేసవికి పరాకాష్టగా భావించే అగ్ని నక్షత్రం దక్షిణాదిన తమిళనాడులో ప్రారంభమైంది. గత నెలరోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు అసలు పరీక్ష గురువారం నుంచే ప్రారంభమైంది. ఇప్పటినుంచి మే చివరివరకు అంటే 25 రోజులపాటు ప్రజలు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ముందస్తు హెచ్చరిక చేసింది. మరో మూడువారాలపాటు మధ్యాహ్నం 12 గంటల నంచి సాయంత్రం 3 గంటలవరకు ప్రజలు ఇళ్లు వదిలి బయట తిరగడాన్ని సాధ్యమైనంతర వరకు మానుకోవాలని సూచించింది.
తమిళనాడులో కత్తెర కార్తి అనే అగ్ని నక్షత్రం ప్రారంభమైనా, తెలుగు రాష్ట్రాల్లో కూడా గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల సమయంలో కూడా భయంకరమైన ఉక్కపోత శరీరాలను దహిస్తోంది. నగరాల్లోని పలు ప్రధాన రోడ్లలో జనసంచారం పలుచబడింది. ప్రధాన రహదారుల్లో ఎండమావులు దర్శనమివ్వడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరిగా ఇళ్లనుంచి బయటకు వచ్చే ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ మూడువారాలు ఇల్లు దాటి బయటకు వచ్చారంటే వెంట బ్యాగులో చన్నీళ్ల బాటిల్ పెట్టుకుని రావడం భానుడి భగభగలను కాపాడుకునే ఉత్తమ మార్గం. భయంకరమైన ఉక్కపోతలో శరీరానికి కావలసిన మోతాదులో నీరు అందివ్వక పోవడం వల్లే దేశంలో వేసవి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. చన్నీళ్లు, మజ్జిగ పుచ్చుకోవడం ఒక్కటే వేసవి తాపాన్ని కాచుకునే మార్గం.
ముఖ్యంగా ఈ మూడువారాలు పగలు మనది కాదని గమ్మునుంటే, బయటకు రాకుండా నీడపట్టున ఉంటే ఒంటికీ మంటికీ కూడా మంచిదని వైద్యుల సూచన.