Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొల్లేరు అంబాసిడర్ గా కొంగజాతి పక్షి

కొల్లేరు అంబాసిడర్ గా కొంగజాతి పక్షి
, గురువారం, 7 అక్టోబరు 2021 (06:38 IST)
కొల్లేరు అంబాసిడర్ గా కొంగజాతి పక్షి {గూడకొంగ } నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్  వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాది కా అమృత్ మహోత్సవ్  ఐకానిక్  వీక్ కార్యక్రమంలో  భాగంగా రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో పోస్టర్, లోగోను, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మ్యాప్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిత్తడినేలలను  పరిరక్షించుకోవాల్సిన  భాద్యత మనందరిపై  ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2002లో కొల్లేరు ప్రాంతాన్ని రాంసార్ గా డిక్లేర్ చేయటం జరిగిందన్నారు.

ప్రస్తుతం కొల్లేరు ప్రాంతం సగం ఏరియా వైల్డ్ లైఫ్ అభయారణ్యంగా మిగతా ప్రాంతం వెట్ ల్యాండ్ గా  ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం మొత్తం ఈ వెట్లాండ్ ఆవశ్యకతను తెలియజేస్తూ బోర్డులను  పెట్టటం జరుగుతుందన్నారు.

వెట్లాండ్స్  పరిరక్షణ కోసం  వెట్లాండ్ మిత్రాస్ ను  నియమించడం జరిగిందని  తెలిపారు. స్థానికంగా సేవా దృక్పధం  ఉన్నవారిని గుర్తించి  వెట్లాండ్ మిత్రాస్ ను  ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం  కొల్లేరులో ఉన్న ఈ  కొంగజాతి పక్షులు  గ్లోబల్  మొత్తం మీద  నలభై  శాతానికి  పైగా ఇక్కడే   ఉన్నాయని వివరించారు.

దీంతో వెట్ ల్యాండ్  అంబాసిడర్ గా ఈ పక్షిని  ఎంపిక చేయడం  జరిగిందని  తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ, వాటి ఆవశ్యకతను  వివరిస్తూ  అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు  చైతన్య కార్యక్రమాలు  నిర్వహించటం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడం, వన్యప్రాణి సంరక్షణ విషయంలో తమకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీం అనుమ‌తి