చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. వేలాదిమంది భక్తులు ఆలయాలకు ప్రతిరోజు వచ్చి వెళుతుంటారు. లాక్‌డౌన్ కారణంగా 80 రోజుల పాటు ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయం మాత్రమే తెరిచి ఉంచి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం లేదు.
అయితే తాజాగా కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆలయాలను తెరిచేందుకు సిద్ధమైంది రాష్ట్రప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. దీంతో చిత్తూరు జిల్లాలోని ఆలయాలన్నీ తెరుచుకోనున్నాయి.
కానీ ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం మాత్రం మూతపడే ఉంటుంది. అందుకు కారణం కరోనా. కంటోన్మెంట్ జోన్లో శ్రీకాళహస్తి ఆలయం ఉండటంతో ఆలయాన్ని తెరవకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నార దేవస్థానం అధికారులు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
దీంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం 8వ తేదీ తెరిచే అవకాశమే లేదు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చాలా ఫేమస్. అయితే అలాంటి ఆలయాన్ని లాక్‌డౌన్ సడలింపుల తరువాత కూడా తెరవరన్న విషయం తెలుసుకున్న భక్తుల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఆలయాన్ని ఎప్పుడు తిరిగి తెరుస్తారా అన్న విషయాన్ని మాత్రం దేవస్థానం అధికారులు స్పష్టం చేయలేదు.