తిరుపతి నుంచి కొల్హాపూర్ వెళ్లే ప్రత్యేక రైలు (07415) ఫిబ్రవరి నుంచి ప్రయాణమవుతుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ చీఫ్ కమర్షియల్ మేనేజరు తెలిపారు.
ఫిబ్రవరి 1న తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 9.45కు ప్రారంభమై రేణిగుంట మీదుగా కడప రైల్వేస్టేషన్‌కు రాత్రి 11.53కు చేరుకుంటుంది. 11.55కు తిరిగి ప్రయాణమై ఎర్రగుంట్ల, తాడిపత్రి, గూటి, గుంతకల్లు, బళ్లారి మీదుగా మరుసటిరోజు సాయంత్రం 4.45కు కొల్హాపూర్ చేరుకుంటుందన్నారు.
అలాగే కొల్హాపూర్ నుంచి తిరుపతికి ( 07416)రైలు ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 11.40గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.03కు కడప రైల్వేస్టేషన్ చేరుకుంటుందన్నారు. 5.05కు తిరిగి ప్రయాణమై అదే రోజు ఉదయం 8గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు.