Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు.. 50% అదనపు చార్జీలు!

దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు.. 50% అదనపు చార్జీలు!
విజయవాడ , బుధవారం, 6 అక్టోబరు 2021 (15:21 IST)
ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా పుణ్య క్షేత్రాలు క‌ళ‌క‌ళ లాడుతుండ‌గా, వాటిని ద‌ర్శించేందుకు వ‌చ్చే భ‌క్తులు, ప్ర‌యాణీకుల‌కు ఛార్జీల మోత మోగిపోనుంది. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌డ‌మే కాదు, వాటికి ప్ర‌త్యేక ఛార్జీల‌ను వ‌డ్డించేందుకు సిద్ధం అయింది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్ట ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు అమలు చేస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవన్నారు. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామన్నారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. 
 
ఇంకా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ,‘ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా.. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. విలీనానంతరం కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై భారం పెరిగింది. నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం. సంస్థపై పడుతోన్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు’’ అని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రైతు ఉద్యమానికి రాహుల్ మ‌ద్ద‌తు... త్వ‌ర‌లో గుంటూరుకు రాక