Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పందన' కు విశేష స్పందన

స్పందన' కు విశేష స్పందన
, సోమవారం, 7 జూన్ 2021 (11:58 IST)
'స్పందన' ఫిర్యాదుల కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఫిర్యాదు దారుల సమస్యలను తక్షణం విచారించి నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపుతూ కడపజిల్లా ముందువరసలో నిలిచింది.  దీంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ఆరునెలల కాలంలో 'స్పందన' కు జిల్లా వ్యాప్తంగా 3690 ఫిర్యాదులు రాగా వాటిలో 3639 పరిష్కారం అయ్యాయి.

'స్పందన' ఫిర్యాదుల్లో ఆస్తి తగాదాలు, భూమి సంబంధిత ఫిర్యాదులు, ఇతర సివిల్ వ్యవహారాల్లో తలదూర్చవద్దని జిల్లా ఎస్.పి పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసులు తలదూర్చకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్యగా మారకుండా రెవిన్యూ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ లను, న్యాయస్థానాలను లేదా సంబంధిత అధికారులను బాధితులు సంప్రదించాలని పోలీసు అధికారులు సూచించాలని జిల్లా ఎస్.పి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
 
పోలీసు సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు:
జిల్లాలో పోలీసు సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. బాధితులకు న్యాయం చేయడం వల్ల వారిలో పోలీసు శాఖ పై మరింత నమ్మకం పెంపొందించేలా చూడాలని ఎస్.పి సిబ్బందిని ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.  
 
15 నిమిషాలలో సమస్య విని విచారించి చర్యలు తీసుకునేలా ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయించిన జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ 'స్పందన' కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదు దారులకు కేవలం 15 నిమిషాల్లో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి ఫిర్యాదులను స్వీకరించి విచారించి చర్యలు తీసుకునేలా శ్రీకారం చుట్టారు. ఆయా పోలీస్ స్టేషన్ ల వెలుపల ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.

అందులో 15 నిమిషాల్లో ఫిర్యాదును స్వీకరించక పోతే నేరుగా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9121100500, 9121100717 నెంబర్లకు సంక్షిప్త సందేశం ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ లేదా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకుని.. ప్రియుడితో జంప్ కావాలనుకుంది..