Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పీకర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, శాసనసభ ఉద్దేశమా, ప్రభుత్వ నిర్దేశమా?: వర్ల రామయ్య

స్పీకర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, శాసనసభ ఉద్దేశమా, ప్రభుత్వ నిర్దేశమా?: వర్ల రామయ్య
, శుక్రవారం, 3 జులై 2020 (10:28 IST)
స్పీకర్ ప్రభుత్వ నిర్ణయాలకు వత్తాసు పలకడం, కోర్టులపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, శాసనసభ ఉద్దేశమా, ప్రభుత్వ నిర్దేశమో స్పష్టం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రకటన విడుదల చేశారు.
 
"ప్రభుత్వ నిర్ణయాలకు స్పీకర్ వత్తాసు పలకడం ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమా, శాసనసభ ఉదేశమా, ప్రభుత్వ నిర్దేశమా తేల్చి చెప్పాలి ఆర్థిక బిల్లును మండలి అడ్డుకున్న చరిత్ర ప్రపంచంలో లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించడం తగదు.

తిరుమలలో కలియుగ దైవం ఏడుకొండల వారి సన్నిధిలో స్పీకర్  తమ్మినేని సీతారం మండలిలో జరిగిన అంశంపై రాజకీయంగా మాట్లాడి చట్టసభల నిబంధనలను ఉల్లంఘించారు.

శాసనసభకు స్పీకర్ గా ఉంటూ మరో చట్ట సభను కించ పరచడం డాక్టర్  బాబా సాహెబ్  అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్లే. 

ప్రజా సంక్షేమ పథకాలపై పార్టీలు విమర్శలు చేయడం సరికాదన్న స్పీకర్ తమ్మినేని చట్టసభల పరిధిని గుర్తించి మసలు కోవాలి.  ప్రభుత్వ నిర్ణయాలకు స్పీకర్ వత్తాసు పలకడం ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమా, శాసనసభ ఉదేశ్యమా, ప్రభుత్వ నిర్దేశమా తేల్చి చెప్పాలి.

న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానించే ముందు ఏ వ్యవస్థ వ్యక్తిత్వం ఆ వ్యవస్థకు రాజ్యాంగంలో పొందు పరచడాన్ని గౌరవించాలి.  రాజ్యాంగ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపే అవకాశం జ్యుడీషియల్ వ్యవస్థకు అప్పగించారు.

1975లో అమేధీ నియోజకవర్గంలో గెలిచి ప్రధాని పదవిని స్వీకరించిన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన ఘనత అలహాబాద్ హైకోర్టుకు ఉంది.

అంత ప్రాధాన్యమున్న జ్యుడీషియల్ వ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు కంటేప్ట్ ఆఫ్ కోర్టు కింద కు వస్తుంది. తమ్మినేని జ్యుడీషియల్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి" అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా కరాళనృత్యం.. రికార్డు స్థాయిలో 20,903 కేసులు