Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్వరమే మంచినీటి సరఫరా మెరుగు: విజ‌య‌వాడ మేయర్

Advertiesment
fresh water supply
, శుక్రవారం, 28 మే 2021 (19:17 IST)
విజ‌య‌వాడ మేయర్  రాయన భాగ్యలక్ష్మి నగర పర్యటనలో భాగంగా 41వ డివిజన్ పరిధిలోని పలు విధులలో పర్యటించి స్థానికులను వారి యొక్క సమస్యలు మరియు ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంలో  స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ డివిజన్ పరిధిలోని పలు సమస్యలతో పాటుగా పలు అభివృద్ధి పనులకు సంబందించి పనులు ఆమోదించినప్పటికి ఇంకను పనులు చేపట్టకపోవుట వల్ల స్థానికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోనుచున్న విషయాన్ని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై అధికారులతో కలసి డివిజన్ పరిధిలో పర్యటిస్తూ, భవానిపురం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం నందు షెడ్ నిర్మాణ పనులు సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని,  మిరాసాహేబ్ వీధిలో 4.35 లక్షల అంచనాలతో రోడ్ ఎత్తు పెంచే పనులు ఆమోదం పొందిన దానిపై వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

స్వాతి సెంటర్ నుండి కాంబ్రె రోడ్ క్రాస్ నందు డ్రెయినేజి సమస్య పరిష్కారానికై కల్వర్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరిన దానిపై అధికారులను వివరాలు అడిగితెలుసుకోనిన దానిపై కల్వర్ట్ ఏర్పాటు కొరకు నేషనల్ హై వె వారికీ అనుమతి కొరకు లేఖను పంపించుట జరిగిందని ఆమోదం వచ్చిన వెంటనే పనులు చేపడతామని వివరించ సంబందిత త్వరితగతిన ఆమోదం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ కి సూచించారు. 
 
హరిజనవాడ నందు పర్యటిస్తూ పైప్ లైన్ పూర్తిగా పాడైనందున వారం రోజుల లోపు పాత పైపు లైన్ల తొలగించి కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతములో మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు సిల్ట్ తొలగింపు పనులు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

డివిజన్ పరిధిలో సైడ్ డ్రెయిన్స్ పై ఏర్పాటు చేసిన చప్టాలు దూరంగా ఉండుట వల్ల సిల్ట్ తొలగింపులో ఇబ్బందులు కలుగుతున్న విషయాని శానిటరీ అధికారులు తెలిపిన దానిపై డ్రెయిన్ల పై ఏర్పాటు చేసిన మ్యాన్ హోల్స్ దగ్గర దగ్గరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు. 

డివిజన్ పరిధిలో ప్రజలకు అందించు మంచినీటి సరఫరా సమయాన్ని పెంచాలని,  మరియు డివిజన్ లో వర్ష కాలంలో ఎటువంటి ఇబ్బంది కలుగకూడా డివిజన్ పరిధిలోని అన్ని మేజర్ మరియు అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు సిల్ట్ తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అధికారులకు సూచించారు. వీటితో పాటుగా డివిజన్ ప్రజలు అందుబాటులో ఉండే విధంగా 4 బోర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

రాబోవు వర్షాకాలంలో మురుగునీరు రోడ్లుపై ప్రవాహించకుండా తగు ప్రణాళికలు తాయారు చేసుకొని ఎల్ అండ్ టి వారి ద్వారా డివిజన్ పరిధిలో ఇంకను చేపట్టవలసిన డ్రెయిన్ నిర్మాణ పనులు వెనువంటనే చేప్పటి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ రోగుల కోసం ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్సిజ‌న్ బెడ్లు