Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన భార్యతో అక్రమ సంబంధం ఉందని తండ్రిని హత్య చేయించిన తనయుడు

కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన ఓ కసాయి బిడ్డ... కన్నతండ్రిని కడతేర్చాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
Son Killed Father
, సోమవారం, 17 అక్టోబరు 2016 (14:21 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన ఓ కసాయి బిడ్డ... కన్నతండ్రిని కడతేర్చాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఉగిని గ్రామానికి చెందిన శ్రీనివాసప్ప కుమారుడు నరసింహులు. వికలాంగుడైన నరసింహులుకు ఇటీవలే వివాహమైంది. ఇంటికి వచ్చిన తన భార్యతో తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం నరసింహులుకి బలంగా పడిపోయింది. 
 
దీంతో అదే గ్రామానికి చెందిన గఫార్, గౌస్‌లతో మాట్లాడి, తన తండ్రిని హత్య చేయాలని పథకం వేశాడు. ఆపై నిందితులు శ్రీనివాసప్పకు పూటుగా మద్యం తాపించి, మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టారు. 
 
ఒక రోజంతా తండ్రి ఇంటికి రాకపోవడంతో ఏమీ తెలియనట్టుగా నరసింహులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు నరసింహులు చెబుతున్న పొంతన లేని సమాధానాలతో అనుమానం వచ్చి తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం ఒప్పుకున్నాడు. ఆపై హత్యకు సహకరించిన నిందితులూ లొంగిపోయారని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు కోసం నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రేమికులు