Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకంపనలు రేపుతున్న క్యాసినో : సోము వీర్రాజు అరెస్టు

Advertiesment
Somu Veerraju
, మంగళవారం, 25 జనవరి 2022 (16:34 IST)
కృష్ణా జిల్లా గుడివాడలో వెలుగు చూసిన క్యాసినో వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. గుడివాడ సమీపంలోని నందమూరు వద్ద బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తమ పార్టీ కార్యక్రమాల్లో ఒకదానికి తాము వెళ్తున్నామని సోము వీర్రాజు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గుడివాడలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 
 
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీకాం చ‌ద‌వ‌క‌పోయినా... త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని అశోక్ బాబుపై సిఐడి కేసు