Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిల్మ్ సిటీలో 365 రోజులు జరిగే డ్యాన్సులపై ప్రశ్నించాలి : అంబటి

Advertiesment
ఫిల్మ్ సిటీలో 365 రోజులు జరిగే డ్యాన్సులపై ప్రశ్నించాలి : అంబటి
, సోమవారం, 24 జనవరి 2022 (08:13 IST)
అధికార వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో జరిగిన క్యాసినో డ్యాన్సులు కనిపించి తెలుగుదేశం పార్టీ నేతలకు రామోజీ ఫిల్మ్ సిటీల్ 365 రోజులు పాటు జరిగే డ్యాన్సులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ముందు ఈ డ్యాన్సులపై ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు. 
 
సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటరులో మూడు రోజుల పాటు క్యాసినో డ్యాన్సులు జరిగాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వీటిపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వీటికి వైకాపా నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. 
 
ఇపుడు సత్తెనపల్లి అంబటి రాంబాబు మాట్లాడుతూ, గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిజ నిర్ధారణ పేరుతో గుడివాడపై టీడీపీ దాడికి వెళ్లిందని ఆయన అన్నారు. సంస్కృతి, సంప్రదాయం అంటూ మంత్రి కొడాలి నానిపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. తమది ఉద్యోగులపై కక్ష సాధించే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అందువల్ల ఉద్యోగులు చర్చలకు రావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి