Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసులు, అధికారులకు సోమిరెడ్డి వార్నింగ్

Advertiesment
పోలీసులు, అధికారులకు సోమిరెడ్డి వార్నింగ్
, మంగళవారం, 23 జూన్ 2020 (09:23 IST)
అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదమనుకుంటూ అడ్డగోలుగా వ్యవహరించడం అధికారులకు తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో పేదలకు రక్షణ, మానసిక ప్రశాంతత కరువైందని అన్నారు. టీడీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి వెంటపడి వేధిస్తారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కొందరు పోలీస్, రెవెన్యూ అధికారుల పనితీరుకు చెర్లోపల్లి ఘటన పరాకాష్ట అని మండిపడ్డారు.

బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేసి దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులు తేవడం దురదృష్టకరమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులే దీనికి బాధ్యత వహించాలని సోమిరెడ్డి సూచించారు.

'అన్ని ప్రాంతాల్లోనూ దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేయడం అన్యాయం. జిల్లాలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారుల పనితీరు దారుణంగా ఉంది. కొందరు పేదలను మానసికంగా హింసిస్తున్నారు. దళిత, గిరిజన, బడుగుబలహీన వర్గాల ప్రజల జోలికి వెళ్లొద్దు.

పదేపదే వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్, ఎస్పీలు విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలి' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను నిర్లక్ష్యం చేస్తారా?: చంద్రబాబు