Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోపాల్ ఎన్‌కౌంటర్... ఎనిమిది మంది టెర్రరిస్టుల హతం.. అసదుద్ధీన్ ఓవైసీ ఏమన్నారంటే?

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయి మధ్యప్రదేశ్ పోలీసుల చేతిలో హతమైన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఓవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై మధ్యప్రదేశ్ పోలీస

Advertiesment
SIMI terrorists
, సోమవారం, 31 అక్టోబరు 2016 (17:39 IST)
భోపాల్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లతో సమస్య పరిష్కారం కాదని హితవు పలికారు. గత అర్ధరాత్రి మధ్యప్రదేశ్ భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు.

ఏటీఎస్, పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మహబూబ్‌, అంజాద్‌ఖాన్‌, జకీర్‌ఖాన్‌, అఖిల్, సాలిఖ్‌, మజీబ్‌షేక్‌, ఖలీద్‌, మజీద్‌ హతమయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని ఓవైసీ డిమాండ్ చేశారు. 
 
ఇంకా భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయి మధ్యప్రదేశ్ పోలీసుల చేతిలో హతమైన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై ఓవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చెబుతున్న వాదన తమకు అంగీకారం కాబోదని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. కేవలం మెజిస్టీరియల్ విచారణ జరిపించడం తమకు సమ్మతం కాదన్నారు. సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ జరగడం తనను షాక్‌కు గురిచేయలేదని.. కానీ మధ్యప్రదేశ్ జైళ్లలో సిసిటీవీలు పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఒవైసీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య అనుమానిస్తోందని విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చంపేసిన భర్త..