భార్య అనుమానిస్తోందని విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చంపేసిన భర్త..
ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అ
ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అనే వ్యక్తి పాము విషాన్ని భార్య సహీదాకు ఇంజక్షన్ రూపంలో ఇచ్చి చంపేశాడు. సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుంచి ఈ విషాన్ని సాహెబ్ కొనుగోలు చేశాడు. భార్య అనుమానిస్తోందని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మొగల్ సాహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రినే హత్య చేసేందుకు ఓ కొడుకు కట్టుకున్న భార్యతో కలిసి ప్రయత్నించాడు. తండ్రి నోట్లు పురుగుల మందు నోట్లో పోసి.. వంటిపై కిరోసిన్‌చల్లి నిప్పంటించేందుకు ఇరువురు యత్నించారు. తండ్రి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు బాదితుడిని కాపాడారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు.