Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల ఉప ఎన్నిక : వైకాపా అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి

టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున ఇటీవల ఆ పార్టీలో చేరిన టీడీపీ నేత శిల్పా మో

Advertiesment
నంద్యాల ఉప ఎన్నిక : వైకాపా అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి
, ఆదివారం, 25 జూన్ 2017 (16:01 IST)
టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున ఇటీవల ఆ పార్టీలో చేరిన టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. 
 
ఈ మేరకు వైఎసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జరిపిన చర్చల అనంతరం వైకాపా అధినేత జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థిగాశిల్పా మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నామని, అంతేకాకుండా, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగానూ ఆయన్నినియమించామని జగన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, ఈ స్థానం నుంచి టీడీపీ తరపున భూమా కుటుంబ సభ్యులు లేదా బలమైన ప్రత్యర్థిని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరిలోకి దించే అవకాశం ఉంది. వైకాపా శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరత్ కారు వేగం.. గంటకు 140 కిమీ : బ్రేకు వేయలేనంతగా మద్యం కైపు..