Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని... ఎలా జరిగిందో తెలియదంటోంది...

సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి పోతోంది. వావివరుసలు మరిచిపోతున్నారు. మనిషిన్న విషయాన్ని అసలే మరిచిపోతున్నారు. సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఎన్నో విధాలుగా

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని... ఎలా జరిగిందో తెలియదంటోంది...
, శుక్రవారం, 19 జనవరి 2018 (19:34 IST)
సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి పోతోంది. వావివరుసలు మరిచిపోతున్నారు. మనిషిన్న విషయాన్ని అసలే మరిచిపోతున్నారు. సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చెబుతున్నారు కవులు, రచయితలు.
 
అలాంటి సంఘటనల్లో ఒకటి మీరు చదవబోతున్నది. తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడుపబడుతున్న పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో ఒక విద్యార్థిని పెళ్ళి కాకుండానే తల్లయ్యింది. కడుపు నొప్పితో డిసెంబర్ 31వ తేదీన టిటిడి సెంట్రల్ ఆసుపత్రిలో సహచర విద్యార్థినులు చేర్పించారు. అయితే ఆసుపత్రిలో ఆ విద్యార్థిని పురిటి నొప్పుతో బాధపడుతోందని చెప్పారు. దీంతో హాస్టల్ సిబ్బందితో పాటు సహచర విద్యార్థులు ఆశ్చర్యపోయారు. పద్మావతి మహిళా కళాశాలలో చదువుకునే విద్యార్థినులను బయటకు పంపించరు. హాస్టల్‌లో ఎప్పుడూ క్రమశిక్షణగానే ఉండాలి. అలాంటి పరిస్థితి ఉన్న ప్రాంతంలో ఈ విద్యార్థిని ఎవరిని కలిసింది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 
అంతేకాదు జనవరి 1వ తేదీన ఒక నర్సింగ్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు హడావిడిగా ఆసుపత్రికి వచ్చారు. తమ బిడ్డను నిలదీశారు. ఎవరో నాకు తెలియదు.. తనకు ప్రియుడెవ్వరు లేదు అంటూ విద్యార్థిని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు హతాశయులయ్యారు. తమ బిడ్డ అమాయకత్వమా లేకుంటే భయపడి చెప్పడంలేదా అర్థం కాక తల్లిదండ్రులు సతమతపడుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పద్మావతి డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్ వార్డెన్‌తో పాటు డిప్యూటీ వార్డెన్లకు మెమోలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెమోలు జారీ చేశారు. ఆ విద్యార్థిని తల్లి ఎలా అయ్యిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప రాష్ట్రపతి షూలనే కొట్టేసిన దొంగలు... డొల్ల సెక్యూరిటీ అంటూ...