Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అపార్ట్మెంట్ వాచ్ మెన్ కుమార్తె అనుమానాస్ప‌ద మృతి

అపార్ట్మెంట్  వాచ్ మెన్ కుమార్తె అనుమానాస్ప‌ద మృతి
విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (13:06 IST)
విశాఖ అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్  వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి 9 గంటలు నుంచి  బాలిక కనబడకుండా పోవడంతో తల్లిదండ్రులు చీకటిలో వెతికటానికి వెళ్లారు. చివ‌రికి ఆమె ప‌క్క అపార్ట్ మెంట్ కింద మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. 
 
దీనిపై విచార‌ణాధికారి దువ్వాడ సిఐ లక్ష్మి మాట్లాడుతూ, బాలిక మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసామ‌న్నారు. అదిత్య నివాస్ 4 పోర్ల్ నుండి బాలిక దూకి చనిపోయిందని ప్రాధమికంగా నిర్థారణకు వచ్చామ‌ని, పై నుండి దూకడం వల్ల కాలు విరిగిపోయి, తలకు బలమైన గాయం ఖావడంతో మృతి చెందిందని తెలిపారు.
 
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పెట్ట  ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చింది. కూర్మన్నపాలెం శ‌నివాడ వద్ద ఆదిత్య అపార్ట్మెంట్లో వాచ్ మెన్ గా చేరారు. ఈ దశలో వారి కుమార్తె పద మూడేళ్ల కీర్తన నిన్నసాయంత్రం నుంచి కనిపించ లేదు. కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాల్లో వెదికారు.  ఈ రోజు తెల్లవారుజామున పక్క అపార్ట్మెంట్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. ఎవరైనా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతదేహం అక్కడి నుంచి తీయకుండా ఆందోళన బాట పట్టారు. ఆమె త‌న మేనమామ వాచ్ మెన్ గా పనిచేస్తున్న అపార్ట్మెంట్ పై నుండి దూకింది. ఎందుకు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? అసలు ఏం జరిగింది అన్న దానిపై విచారణ చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలనీలోకే బస్సు : తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం