Publish Date: Wed, 30 Jun 2021 (07:17 IST)
Updated Date: Wed, 30 Jun 2021 (07:19 IST)
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని సోమవారం ఉమెన్ చాందీ అనడంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని స్పష్టం చేశారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఏపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ చెప్పారన్నారు.
కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని శైలజానాధ్ పేర్కొన్నారు.
చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులని తెలిపారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణమన్నారు.
భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని ప్రెస్ నోట్‌లో సాకే శైలజానాధ్ స్పష్టం చేశారు..