Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశాన్ని కాపాడండి: కేశినేని శ్వేత

దేశాన్ని కాపాడండి: కేశినేని శ్వేత
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:43 IST)
గురువారం ఉద‌యం కేశినేని భ‌వ‌న్‌లో చ‌ర్చిల్లోని పాస్ట‌ర్ల‌కు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా లలో ప‌నిచేసే ఫొటోగ్రాఫ‌ర్ల‌కు వీడియో గ్రాఫ‌ర్ల‌కు  తెలుగుదేశం పార్గీ నాయ‌కురాలు కేశినేని శ్వేత బియ్యం, నిత్యావ‌స‌రాలు, మాస్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కేశినేని శ్వేత మాట్లాడుతు కరోనా వైరస్ వల్ల ప్ర‌పంచం ఎన్న‌డూ చూడ‌ని ఒక భ‌యాన‌క ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని మన దేశంలో ఫిబ్రవరి 23 నుండి లాక్ డౌన్ అమలులో ఉండటం వలన పనులు లేక అనేక మంది పేదలు, మధ్యతరగతి వారు ఎన్నో ఇబ్బందులు ఎదురుక్కుంటున్నారని, ప్రజలు కూడా కష్టాలకు ఓర్చి ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నారని చెప్పారు. 

'మీలో ప్రతివాడును తన స్వంత కార్యక్రమాలనే కాక ఇతరులకు కూడా సహాయపడవలెను - నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి ' అని జీసస్ క్రైస్ట్ బోధించారు.

ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో చర్చి లను మూసివేయడం వలన అనేక మంది పాస్టర్లకు రోజువారీ గడవడం కూడా కష్టంగా ఉందని వారి ప్రతినిధులు తెలియచేయగా వారికి నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశాము అన్నారు.

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, క‌రోనా వైర‌స్‌ దేశంలో పూర్తిగా నిర్మూల‌న జ‌రిగేలా పాస్ట‌ర్లు ప్ర‌భువును ప్రార్థించాల‌ని సూచించారు. అలాగే ముస్లీం సోద‌రులు ఎంతో ప‌విత్ర‌మైన రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ఇంట్లో ఉంటూ భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటూనే క‌రోనా మ‌హ‌మ్మారిని దేశం నుంచి పార‌ద్రోలేలా ప్రార్థించాల‌ని కోరారు.

ఈ విప‌త్క‌ర సమ‌యంలో ప్రతి ఒక్కరు శానిటైజ‌ర్ల‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ, ముఖాల‌కు మాస్క‌ల్ ధ‌రిస్తూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు  ఇచ్చి ఆదుకోవాలని ఈ సంద‌ర్భంగా ఆమె ‌ డిమాండ్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో పార్లమెంట్ కో ఆర్డినేటర్ లింగ‌మ‌నేని శివ‌రామ‌ ప్ర‌సాద్‌, పాస్టర్ దైవ‌ ప్రకాష్,  ఫోటో, మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ లో కరోనా కట్టడికి మొబైల్ కంటైనర్ వైరాలజీ ల్యాబ్.. దేశంలోనే ప్రప్రథమం