Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుకాసురులపై ఉక్కుపాదం... సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి : ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుక రీచ్ ల వద్ద గట్టి భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై పలు అంశాలపై సీఎం చంద్

ఇసుకాసురులపై ఉక్కుపాదం... సీఎం చంద్రబాబు ఆదేశం
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (20:09 IST)
అమరావతి : ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుక రీచ్ ల వద్ద గట్టి భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై పలు అంశాలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 406 ఇసుక రీచ్‌ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయాలని, వాహన యజమానులపై భారీ మొత్తంలో జరిమానాలు విధించాలన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారి వివరాలను అందజేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ప్రతి ఇసుక రీచ్ దగ్గర ప్రభుత్వ అధికారిని నియమించాలన్నారు. గనుల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దినేష్ కుమార్‌ను ఆదేశించారు.
 
రియల్ టైమ్ గవర్నెన్స్ చేపట్టిన సర్వే నివేదికలను సమీక్షించారు. మద్యం పాలసీ, విశాఖ భూకుంభకోణం, విశాఖపట్నంలో కొత్తగా చేపట్టిన పట్టాల పంపిణీ, మున్సిపాల్టీల్లోని టౌన్ ప్లానింగ్ పనితీరు, అన్న అమృతహస్తం పథకం అమలు తీరు, రైతుల బజార్ల పనితీరుపై సర్వే నివేదికలపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. మద్యం పాలసీ అమలుపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తపర్చారని ఆర్.టి.జి అధికారులు తెలియజేశారు. ఇళ్ల మధ్య ఇంకా మద్యం షాపులు ఉన్నట్లయితే వాటిని తక్షణమే సుదూరు ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

విశాఖపట్నంలో ఇటీవల చేపట్టిన పట్టాల పంపిణీపై అధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే పట్టాల కోసం పట్టాదారుల నుంచి 30 మంది అధికారులు లంచాలు అడిగినట్లు సర్వేలో వెల్లడైందని ఆర్.టి.జి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా అధికారుల నుంచి పట్టాదారులకు వారిచ్చిన నగదును వాపస్ ఇప్పించాలని సీఎం ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నాళ్లకి కాంగ్రెస్ కీలకం... ఖుషీ ఖుషీగా హస్తం ఎమ్మెల్యేలు.. ఎక్కడ?