జయలలిత నన్ను కొట్టారు.. పోయస్ గార్డెన్‌లో కాపలా కుక్కలా ఉంచారు : అన్నాడీఎంకే ఎంపీ శశికళ
తాను చెంపదెబ్బ కొట్టిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ కంటే తనకు తమ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నుంచే తనకు ప్రాణహాని పొంచివుందని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని అన్నాడీఎంకేకు చెందిన రాజ్
తాను చెంపదెబ్బ కొట్టిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ కంటే తనకు తమ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నుంచే తనకు ప్రాణహాని పొంచివుందని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచలన ఆరోపణలు చేశారు. పైగా.. జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్లో తనను ఓ కాపలా కుక్కలా ఉంచారంటూ మండిపడ్డారు.
శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ శశికళ పుష్ప, తిరుచ్చి శివ గొడవపడిన సంగతి తెలిసిందే. తిరుచ్చి శివను చెంప మీద ఆమె ఎడాపెడా కొట్టడం దుమారం రేపింది. ఈ వ్యవహారం జయలలిత దృష్టికి వెళ్లడంతో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ హఠాత్ పరిణామంపై ఆమె స్పందిస్తూ చెంపదెబ్బలు కొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. అలాగే, జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారన్నారు. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో తనను కుక్కులా ఉంచారని ఆరోపించారు.
తనను ఆమె కొట్టారని చెప్పిన శశికళ.. చేయిచేసుకుంది జయలలితా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అన్నా డీఎంకే నుంచి తనను బహిష్కరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక నుంచి నుంచి తాను స్వతహాగా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. సోమవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు. తమిళనాడులో తనకు రక్షణ లేదని, భద్రత కల్పించాల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్కు విన్నవించిన విషయం తెల్సిందే.