Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పీకర్ పోడియం ఎక్కేసిన వైకాపా ఎమ్మెల్యేలు.. జగన్‌కు ఎక్కడ తగ్గాలో తెలియదా?

తెలంగాణ అసెంబ్లీలో ఓవైపు ప్రభుత్వానికి సహకరిస్తూ.. మరోవైపు ఏకిపారేస్తూ.. హుందాగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాన్ని చూసి.. ఏపీ విపక్షం నేర్చుకోవాలని టాక్ వస్తోంది. ఎప్పుడూ గోల.. గందరగోళం సృష్టించేందుకే ఏపీ

స్పీకర్ పోడియం ఎక్కేసిన వైకాపా ఎమ్మెల్యేలు.. జగన్‌కు ఎక్కడ తగ్గాలో తెలియదా?
, గురువారం, 30 మార్చి 2017 (11:14 IST)
తెలంగాణ అసెంబ్లీలో ఓవైపు ప్రభుత్వానికి సహకరిస్తూ.. మరోవైపు ఏకిపారేస్తూ.. హుందాగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాన్ని చూసి.. ఏపీ విపక్షం నేర్చుకోవాలని టాక్ వస్తోంది. ఎప్పుడూ గోల.. గందరగోళం సృష్టించేందుకే ఏపీలో విపక్షం ప్రయత్నిస్తుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేందుకు విపక్షం సహకరించి.. తప్పుచేస్తే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వైకాపా సిద్ధపడట్లేదని.. రాజకీయ పండితులు అంటున్నారు. 
 
ఎమ్మెల్యే రోజా లాంటి నేతలైతే ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించేందుకే వైకాపా చీఫ్ జగన్ పార్టీలో ఉంచుకున్నట్లుందని వారు చెప్తున్నారు. అధికార పక్షాన్ని హుందాగా ఎదుర్కొనేందుకు.. ఆ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టి.. విపక్ష నేత అంటేనే భయపడేలా జగన్ నడుచుకోవాల్సిందిపోయి.. అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుంచి గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ బూతులు తిట్టుకోవడానికి, స్పీకర్ పోడియం వద్ద అరిచేందుకు మాత్రమే పరిమితమైందనే వారు ఫైర్ అవుతున్నారు. 
 
తాజాగా అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వెంటనే చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ నినాదాలతో మొదలు పెట్టిన వైకాపా ఎమ్మెల్యేలు, సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఉన్న స్పీకర్ పోడియంను ఎక్కేశారు. ఇన్ని రోజులూ నిత్యమూ పోడియం కింద నిలబడి మాత్రమే నిరసనలు తెలిపిన వైకాపా గురువారం ఓవరాక్షన్ చేసింది. 
 
శుక్రవారంతో సభ ముగుస్తుందనగా స్పీకర్ చైర్ ను సమీపించి, ఇరువైపులా నిలబడి నినాదాలు చేశారు. "నారా వారి బినామీ నారాయణ", "ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం", "విద్యార్థులకు న్యాయం చేయాలి" అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. విలువైన సభా సమయాన్ని వృథా చేయవద్దని స్పీకర్ కోడెల పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ వినే పరిస్థితిలో లేరు. దీంతో సభ వాయిదా పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీకి రావొచ్చు.. కూర్చోవాలంటే.. మంత్రి కావాల్సిందే..