ఆర్టీసీ బస్సు అంటే...అధ్వాన్నంగా ఉంటుందని తెలుసు గాని... మరీ ఇంత దారుణం అని ఎవరూ ఊహించరు. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ... బస్సు రన్నింగులో ఉండగా, వెనుక చక్రాలు ఊడిపోయాయి. బస్సు బాడీ ముందుకు వెల్ళిపోయి...బురదలో చిక్కుకుని ఆగింది. పాపం ప్రయాణికులు... అందరూ సేఫ్ నే లేండి. బతుకు జీవుడా అంటూ అందరూ దిగివచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం ఈ పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా, ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణీకులున్నారు. అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ, ఇలా బస్సు రెండు చక్రాలు ఊడిపోవడం... తమ సర్వీసులోనే ఫస్ట్ అంటున్నారు...ఆర్టీసీ బస్ డ్రైవర్లు.