Publish Date: Sun, 24 Nov 2024 (17:49 IST)
Updated Date: Sun, 24 Nov 2024 (17:52 IST)
ఏపీలో ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను కాపాడటం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, అవనిగడ్డ కరకట్టపైనుంచి అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది.
సూపర్ లగ్జరీ బస్సు 37 మంది ప్రయాణీకులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతుండగా ఐలూరు - ఐనపూరు మధ్య ఈ ఘటన జరిగింది. బస్పు పదిహేను అడుగుల మేర దిగువకు దుసుకెళ్లింది. నీటి స్థాయి తక్కువగా ఉండడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రోడ్డు గతుకులమయంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.