Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోరుగడ్డకు మొన్న బిర్యానీ, ఇప్పుడు దిండూ దుప్పటి, నిద్రించడగా చల్లగా ఫ్యాన్ (video)

Advertiesment
Borugadda Anil Kumar

ఐవీఆర్

, శనివారం, 9 నవంబరు 2024 (13:57 IST)
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీసులు చేస్తున్న రాచమర్యాదలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే మార్గమధ్యంలో బోరుగడ్డ అనిల్ కు హోటల్లో చక్కగా బిర్యానీ ఇప్పించారు పోలీసులు. తాజాగా బోరుగడ్డకు చక్కగా దిండూ, దుప్పటి ఇచ్చి ఫ్యాను కూడా వేసి అతడు నిద్రపోతుంటే ఎదురుగా కూర్చుని చోద్యం చూస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ క్రిమినల్ కి పోలీసు స్టేషనులో ఇలాంటి రాచమర్యాదలు చేస్తారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఐతే ఇది ఎక్కడ జరిందన్నది స్పష్టత లేదు.  కాగా బోరుగడ్డ అనిల్ కుమార్ పైన ఇప్పటివరకూ 17 క్రిమినల్ కేసులు నమోదై వున్నాయి.
 
బోరుగడ్డకు బిర్యానీ తినిపించిన పోలీసులు
వైకాపా నేత, రౌడీ షీటర్, పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు కల్పించారు. ఆయన అడిగిందే తడవుగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించారు. అంతటితో ఆగని పోలీసులు.. పోలీసు వాహనంలో కాకుండా లగ్జరీ కారులో తీసుకెళ్లారు. ఇలా నిందితుడుకి సపర్యలు చేసిన ఏడుగురు పోలీసులకు ఏపీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏడుగురు ఖాకీలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా  ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. 
 
మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడంతో ఆ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత సహసానికి పాల్పడిన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. 20మంది మృతి