Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

80 రోజుల తరువాత సొంత నియోజకవర్గంలో రోజా బిజీబిజీ

80 రోజుల తరువాత సొంత నియోజకవర్గంలో రోజా బిజీబిజీ
, గురువారం, 17 జూన్ 2021 (23:34 IST)
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి నియోజకవర్గ ప్రజలకు కొన్నిరోజుల పాటు దూరమయ్యారు నగరి ఎమ్మెల్యే రోజా. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత రోజా మళ్ళీ ఫాంలోకి వచ్చేశారు. విజయవాడలోని ఎపిఐఐసి కార్యాలయానికి వెళ్ళిన రోజా ఆ తరువాత నేరుగా తన సొంత నియోజకవర్గానికి వచ్చారు.
 
నగరి నియోజకవర్గంలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు. నగరి సత్రవాడలోని ఎస్టి కాలనీలో 5.5కోట్ల రూపాయలతో 308 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు రోజా. అలాగే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
 
ఈ సంధర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా 80 రోజుల పాటు ప్రజలకు దూరంగా ఉన్నానని.. అయితే అభివృద్థి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని.. అయితే కరోనా పట్ల జనం నిర్లక్షంగా వ్యవహరించవద్దని రోజా విజ్ఙప్తి చేశారు. 
 
ఇక నుంచి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని.. జగనన్న నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నారని రోజా చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వంపై లేనిపోని విమర్సలు చేస్తున్నారని.. చంద్రబాబు పార్టీని కాపాడుకునేందుకు సిఎంపై విమర్సలు చేస్తున్నారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం