నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గాదేవి శనివారం సరస్వతీ అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఆమెకు వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా దర్శనం చేసుకున్నారు. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు.
గత యేడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చేయాలని కోరుకున్నారు. ఇపుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని రోజా చెప్పుకొచ్చారు.
ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నాను. గతంలో కొండపైకి రావాలంటే ఎన్నో అంక్షలు.. ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు. మనసున్నవాడు సిఎం అయితే ఎలా ఉంటుందో గతంలో వైయస్ పాలన చూశామన్నారు.
ఇపుడు కూడా మనసున్న జగన్‌ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. అన్నివర్గాల ప్రజల సంతోషంగా ఉండాలనేదే సిఎం తపన అని అన్నారు. ఇకపోతే, నవరాత్రి ఉత్సవాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని చెప్పారు.