విజయవాడలో గుట్కా, మట్కా... కృష్ణా పుష్కరాల్లో పరువు పోతుందనీ...
విజయవాడ: ప‌్రభుత్వం నిషేధించిన గుట్కాలు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ నగరంలో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. దీనివల్ల నవ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో లక్షలాది మంది యా
విజయవాడ: ప‌్రభుత్వం నిషేధించిన గుట్కాలు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ నగరంలో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. దీనివల్ల నవ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో లక్షలాది మంది యాత్రికులు దేశ విదేశాల నుంచి బెజవాడకు వస్తున్నారు. వారికి కూడా ఇక్కడి గుట్కాలు, మట్కాలు కనిపిస్తే పరువు పోతుందని అధికారులు నడుం బిగించారు.
విజయవాడ నగరంలో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్ర రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా దాడులు నిర్వహించారు. దుర్గగుడి పరిసరాల్లో పలు హోటళ్ళు, స్టాళ్ళ వద్ద గుట్కాలను సీజ్ చేశారు. ఇరవై బృందాలతో దాడులు చేసి, 10 షాపులు సీజ్ చేశారు. పుష్కరాలు ముగిసే వరకు దాడులు, నిఘా కొనసాగిస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెపుతున్నారు.