Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసు మీదపడింది.. సీఎంగా పనిచేయలేను... తప్పించండి : గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్

తనకు వయసు మీదపడిందని, అందువల్ల తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా బహిర్

Advertiesment
Anandiben Patel
, సోమవారం, 1 ఆగస్టు 2016 (17:20 IST)
తనకు వయసు మీదపడిందని, అందువల్ల తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. 
 
నిజానికి గత కొంతకాలంగా ఆనందీ బెన్‌ను తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని ఇలా బయటపెట్టారు. నవంబర్‌లో ఆమెకు 75 సంవత్సరాలు రానున్న నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వచ్చే యేడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే.
 
గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. అదేసమయంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటున్నట్టు అనేక సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. దీంతో ఆమె సీఎం పదవి నుంచి తప్పించాలని కోరినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా ఎంపీల ఆందోళనతో కేంద్రంలో కదలిక... ప్యాకేజీపై కసరత్తుకు ప్రధాని మోడీ ఆదేశం