Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీకి నారా లోకేష్ వైరస్: ఆర్జీవీ

Advertiesment
టీడీపీకి నారా లోకేష్ వైరస్: ఆర్జీవీ
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:06 IST)
సంచలన దర్శకుడు వివాదాల రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్లు చేయడం.. దానితో ట్రెండింగ్‌లో ఉండటం.. వర్మకు అలవాటు. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. అలాంటి వర్మ దృష్టి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మీద పడింది.
 
తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవి పట్టుకుంది.. అది ప్రాణాంతక వ్యాధి అని సంచలన కామెంట్స్ చేశాడు.. అంతేకాదు. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దాని పేరే తారక్9999 అని సూచించాడు. టీడీపీ కార్యకర్తలకు తన సలహా విని.. త్వరపడి.. తెలుగు దేశం పార్టీకి టీకా వేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. లేదా మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారని చెప్పాడు వర్మ.
 
గతంలో కూడా తెలుగు దేశం పార్టీపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీకి అసలు వారసుడు నారా లోకేష్ కాదని, ఆ పార్టీ భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే ఉంటుందని ట్వీట్ చేశాడు. అప్పుడు కూడా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి నారా లోకేష్ ను ప్రమాదకరమైన వైరస్ తో పోల్చడం పై టీడీపీ నేతలు, కార్యాకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​!