ఆనారోగ్యం సాకుగా తప్పించారు కదా.. ఎమ్మెల్యేగా ఎలా పనికొస్తానన్న బొజ్జల
తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రధానంగ
తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రధానంగా ఆయనను అనారోగ్యం కారణంగా మంత్రి పదవి నుంచి తప్పించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన బొజ్జల మంత్రిగా పనిచేసేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని చెప్పి తీసేశారు కదా... ఎమ్మెల్యే పదవిలో కొనసాగేందుకు కూడా తన ఆరోగ్యం సహకరించడం లేదని లేఖలో వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ లేఖను స్పీకర్‌కు, సీఎంకు బొజ్జల పంపారు.
ఇదిలా ఉండగా.. బొజ్జలను కేబినెట్ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. తొట్టంబేడు ఎంపీపీ పోలమ్మ, జడ్పీటీసీ అనసూయమ్మ, కాపుగున్నేరి సింగిల్ విండో చైర్మన్ రవీంద్రనాథ్, తొట్టంబేడు మండల టీడీపీ అధ్యక్షుడు మురళీనాయుడు రాజీనామా చేశారు. బొజ్జలకు మద్దతుగా నిలిచారు.