Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేష్ అనే నేను.... కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం...

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గానికి కొత్త రూపం వచ్చింది. పాత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన తప్పలేదు. కొత్తగా 11 మందికి కేబినెట్‌లో చోటు లభించింది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, రాజకీయ అవసరాలు, సమర్థత... ఇలా అన

Advertiesment
Chandrababu
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:47 IST)
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గానికి కొత్త రూపం వచ్చింది. పాత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన తప్పలేదు. కొత్తగా 11 మందికి కేబినెట్‌లో చోటు లభించింది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, రాజకీయ అవసరాలు, సమర్థత... ఇలా అనేక కోణాల్లో కసరత్తు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ‘తీసివేతలు - చేరిక’లను ఖరారు చేశారు. ఇప్పటిదాకా మంత్రులుగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు), పల్లె రఘునాథరెడ్డి (అనంతపురం), రావెల కిషోర్‌బాబు (గుంటూరు), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), కిమిడి మృణాళిని (విజయనగరం)కి ఉద్వాసన పలికారు. ఈ ఐదుగురి స్థానాలతోపాటు... ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను నింపుతూ మొత్తం 11 కొత్త ముఖాలకు చోటు ఇచ్చారు. 
 
కొత్తగా చోటు దక్కించుకున్న వారిలో కిమిడి కళా వెంకట్రావు (శ్రీకాకుళం), సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), పితాని సత్యనారాయణ, (ప. గోదావరి), జవహర్‌ (పశ్చిమ గోదావరి), నక్కా ఆనందబాబు (గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (నెల్లూరు), నారా లోకేశ్‌ (చిత్తూరు), అమర్‌నాథ రెడ్డి (చిత్తూరు), కాల్వ శ్రీనివాస్‌ (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), భూమా అఖిలప్రియ (కర్నూలు)లు ఉన్నారు. 
 
వీరందరితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వెలగపూడిలో ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. మొట్టమొదట కిమిడి కళా వెంకట్రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశంలో ముసలం.. బొజ్జల రాజీనామాతో షాక్.. చిత్తూరులోనే తిరుగుబాటు