Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల రద్దుతో మోదీకి బురద అంటుకుంది... బాబు ఎక్స్‌పర్ట్... తుడిచేస్తాడు... రాయపాటి

పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోదీకి బాగా బురద అంటుకుంది. ఆ బురదను తుడుచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పని అప్పగించారనీ, బాబు ఇందులో ఎక్స్‌పర్ట్ కనుక ఖచ్చితంగా బురదను కడిగిపారేస్తారన్న నమ్మకముందని ఎంపీ రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చే

Advertiesment
Rayapati Sambasiva Rao comments
, శనివారం, 10 డిశెంబరు 2016 (12:12 IST)
పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోదీకి బాగా బురద అంటుకుంది. ఆ బురదను తుడుచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పని అప్పగించారనీ, బాబు ఇందులో ఎక్స్‌పర్ట్ కనుక ఖచ్చితంగా బురదను కడిగిపారేస్తారన్న నమ్మకముందని ఎంపీ రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
నోట్ల రద్దుతో నరేంద్ర మోదీ ప్రజల గొంతును నొక్కారన్నారు. నోట్ల కష్టాలతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసే ముందు సరైన ప్రణాళికతో వచ్చి వుంటే బావుండేదని, కానీ నరేంద్ర మోదీ ఆ పని చేయలేదని వ్యాఖ్యానించారు. 
 
ఒకవైపు కొత్త నోట్ల కోసం సామాన్యుడు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తుంటే, బడా బాబులకు మాత్రం కొత్త నోట్లు కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయనీ, చెన్నైలో 120 కోట్లు కొత్త నోట్లు వెలుగుచూడటం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. కొత్త నోట్లు ఇలా పక్కదారి పడితే సామాన్యుడి కష్టాలు తీరేదెప్పుడు అని ప్రశ్నించారు. మోదీ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఆచరణలో దెబ్బతిన్నారన్నారు. కొత్త నోట్ల రద్దుతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో డబ్బులు పంచడానికి కుదరదనీ, అందుకే వాళ్లంతా పార్లమెంటును స్తంభింపజేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు శశికళ స్లో-పాయిజన్ ఇచ్చేసింది.. 2012లో తెహల్కా కథనం.. మన్నార్ గుడి మాఫియా?