ఏపీలో రేషన్ షాపులకు దిగుమతి కావల్సిన సరుకు రవాణా నిలిచిపోయింది. అధికారుల తీరుకు నిరసనగా.. రేషన్ సరుకు దిగుమతిని నిలిపేశామని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు.
రేషన్ సరుకు బ్యాగులలో కొన్నిటిని వెనక్కు ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. వెనక్కు ఇవ్వకపోతే ఒక్కో బ్యాగుకు రూ.40 చెల్లించాలని ఆంక్షలు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
ఇంటింటికి రేషన్ పంపిణీ అవకముందే అధికారులు ఆంక్షలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈరోజు నుండి అధికారుల తీరుకు నిరసనగా.. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ గోడౌన్ల నుండి సరకు దిగుమతి నిలిపేశామని ప్రకటించారు.
జీవో నెంబర్ 10 ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు.