రాజమండ్రిలో దారుణం : మానసిక వికలాంగులరాలని కూడా జాలి లేకుండా..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలనే జాలి కూడా లేకుండా ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలనే జాలి కూడా లేకుండా ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ వివరాలను పరిశీలిస్తే... స్థానిక అమలాపురం మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న మానసిక వికలాంగురాలిపై కొప్పనాతి సతీష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ దాడిలో గాయపడిన బాధితురాలికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలిస్తున్నారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై స్థానిక మహిళా సంఘాలు ఆందోళనకు దిగి.. ఆ కామాంధుడిని తక్షణం అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.