Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం జగన్‌కు గుండెల్లో దడ... రంగంలోకి దిగిన ఆర్ఆర్ఆర్

Advertiesment
raghurama - supreme
, బుధవారం, 1 నవంబరు 2023 (20:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మన్ముందు కష్టాలు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నడుంబిగించారు. ఇందుకోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతుందని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు జగన్‌పై కేసులను 3071 సార్లు వాయిదా వేసిందని, అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రఘురామరాజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగనుంది. 
 
"జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారు. డిశ్చార్జి పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి" అని రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపనుంది. 

ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్.. వివేక్ రాజీనామా... కాంగ్రెస్‌‍లో చేరిక!!  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాంరాం చెప్పేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అదేసమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన వివేక్... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, అప్పటి తెరాసలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ఇపుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి తిరిగి సొంత గూటికే చేరుకోనున్నారు. 
 
నిజానికి ఆయన పార్టీ మారుతారంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతుంది. అయితే, అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వచ్చారు. తాజాగా ఆయన తన రాజీనామా లేకను కిషన్ రెడ్డికి పంపించడంతో ఆయన పార్టీ మారడం తథ్యమని తేలిపోయింది. 
 
అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు.. ఎందుకని? 
 
అగ్రరాజ్యం అమెరికాలో జిల్లా కేంద్రమైన ఖమ్మంకు చెందిన విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. అతన్ని ఓ దండగుడు కత్తితో పొడిచాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. యువకుడి తండ్రి రామ్మూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మంకు చెందిన మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్ (29) అనే విద్యార్థి ఎంఎస్ చేస్తూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా ఉన్నట్టుండి ఓ దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. ఆ వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. 
 
ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌న్ కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి కోసం స్విస్ మిలిటరీ ప్రీమియం గృహోపకరణాలు- ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల విడుదల