పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచోడు.. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో ఆయన నెగ్గుకు రావడం కష్టమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.
ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలు మార్చుకుంటే ఆయనకు మంచి భవిష్యత్తు వుంటుందనీ చెప్పారు ఆర్ఆర్ఆర్.
'మరి, జనసేన పార్టీలోకి వెళతారా.?' అని ప్రశ్నిస్తే, కాలమే సమాధానం చెబుతుందంటూ ముసిముసి నవ్వులు నవ్వేశారు. బీజేపీలో చేరాలా.? బీజేపీ మిత్ర పక్షమైన జనసేనతో కలవాలా.? అన్నదానిపై రఘురామ కొంత డైలమాలో వున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే.. జనసేన పార్టీకి రఘురామకృష్ణ రాజు లాంటి ఆర్థికంగా వెన్నుదన్ను కలిగిన నాయకులు అవసరం. కానీ, జనసేన అధినేత ఆ దిశగా రాజకీయ ఆలోచనలు చేయడంలేదు.
కాగా.. 2019 ఎన్నికల్లో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబుని ఓడించింది రఘురామకృష్ణరాజే కావడం గమనార్హం. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదని నాగబాబు ప్రకటించారు.