కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తనయుడు పీవీ కౌశిక్ రెడ్డి నీట్‌లో ఆలిండియా 23వ ర్యాంక్ సాధించారు. కౌశిక్ తండ్రి డాక్టర్ పి వెంకటరామముని రెడ్డి వాటర్ షెడ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.వైఎస్సార్ కడపజిల్లాకు చెందిన కౌశిక్ రెడ్డి తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌లో పదో తరగతి చదివారు. పదో తరగతి సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షల్లో 500 మార్కులకుగాను 488 (97.6%) సాధించారు. 12వ తరగతి సీనియర్ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలలో 1000 మార్కులకు 985 (98.5%) సాధించాడు. విజయవాడ గోసాలలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో నీట్ కోచింగ్ తీసుకున్నాడు.
కౌశిక్‌రెడ్డి 10వ తరగతిలో ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్, 12వ తరగతిలో కేవీపీవై స్కాలర్‌షిప్ (ర్యాంక్ 233) పొందాడు. ఎన్‌ఎస్‌ఈబీలో నేషనల్ టాప్ 1శాతం( బయాలజీ ఒలింపియాడ్ స్టేజ్ 1).ముంబైలోని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఓరియంటేషన్ క్యాంపుకు ఎంపికయ్యారు. సీబీఎస్‌ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రాంతీయ స్థాయి టాపర్, 9వ తరగతిలో జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. కౌశిక్‌రెడ్డి 9వ తరగతిలో సిల్వర్‌జోన్ ఒలింపియాడ్స్‌లో 3 బంగారు పతకాలు, 3 రజత పతకాలు, కాంస్య పతకం సాధించారు. 10వ తరగతిలో సిల్వర్‌జోన్ ఒలింపియాడ్స్‌లో 4 బంగారు పతకాలు, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించారు.
నీట్‌లో ఆలిండియా 23 వ ర్యాంక్ సాధించిన కౌశిక్ రెడ్డి డిల్లీ ఎయిమ్స్‌లో పీడీయాట్రిషన్ కావాలన్నదే తన స్వప్పమని తెలిపారు. తనకు నిరంతరం మద్దతు తెలిపిన తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, సిస్టర్, టీచర్లు, స్నేహితులకు కౌశిక్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.