Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి: అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ

ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి: అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:46 IST)
మూడు రాజధానుల బిల్లుకు హైకోర్టు పదిరోజుల స్టేటస్ కో స్టే ఇవ్వడం శుభపరిణామం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. విజయవాడ అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల విలేకరుల సమావేశం మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒక మొండి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ప్రజా వేదిక కూల్చడంతో పాలన ప్రారంభించాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై కోపం ఆయనపై కక్ష తీర్చుకోవాలి కానీ ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని సూచించారు.

దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి చీటర్ అని ప్రజలు భావిస్తున్నారని రాజధాని మార్పు అంశంపై రిఫరెండం పెట్టాలని, ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలో ఉంటుందని ప్రజలను మోసం చేసారని అన్నారు.

విశాఖపట్నం వెళ్ళడానికి ఎవరి ఆమోదం లేదని, ఎవరి ఆమోదం లేకుండా విశాఖపట్నం ఎందుకు వెళ్లాలని భావిస్తున్నారు అని ప్రశ్నించారు. మీ హిడెన్ ఎజెండా అంతా అమరావతిని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నారని, అమరావతి రెండు జిల్లాలకు సంబంధించిన సమస్య కాదని రాష్ట్ర సమస్య అన్నారు.

మీకు ప్రజలపై విశ్వాసం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని కోరారు. గన్నవరం ఎంఎన్ఏ వంశీ, టిటీపి ఎమ్.ఎల్.ఏలు, కృష్ణా గుంటూర
 
జిల్లాల ఎమ్.ఎల్.ఏలే అమరావతి కోసం రాజానామా చేస్తాం అంటున్నారన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగుతుందని సిఎం ప్రకటనచేయాలని హైకోర్టులో స్టే ఇవ్వడంతో ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
 
అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఆర్.వి స్వామి మాట్లాడుతూ అమరావతి ఉద్యమం నేటికి 230 రోజులు పూర్తి అయ్యిందని అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమరావతి విషయంలో పునరాలోచించాలని విశాఖపట్నంను ఆర్థికముగా, పర్యటకంగా అభివృద్ధి చేయాలని కోరారు.

రాయలసీమసీమనుండి విశాఖపట్నం వెళ్ళడానికి 1200 కిలోమీటర్లు దూరం ఉందని, సిఎం జగన్ అమరావతి ని రాజధానిగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని తరలిపోకుండా ఉండేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. న్యాయస్థానాలు అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వడంపై సంతోషంగా ఉందన్నారు.
 
కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అమరావతి మహిళలు హైవేపై ఆంద్రప్రదేశ్ ను కాపాడండి అమరావతిని రక్షించండి అంటూ మోకాళ్ళపై నిలబడి న్యాయమూర్తులకు తమ ఆవేదన తెలిసేలా ప్రాధేయపడ్డాడరని అన్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని సాధిస్తామని, వైసీపీ నాయకులకు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని జ్యోష్యం చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అమరావతిలో రాజధాని కొనసాగేలా ముఖ్యమంత్రికి చెప్పాలని విన్నవించారు.
 
తెదేపా నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ ను అయ్యో అనే పరిస్థితి నుండి ఆహా ఆంధ్రప్రదేశ్ అనే విదంగా చంద్రబాబు తీర్చిదిద్దారన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులను హేళనచేశారని, రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలలను గుర్తించాలని కోరారు.

రైతులకు, రాష్ట్రానికి న్యాయం జరిగేలా హైకోర్టులో స్టే ఇచ్చారని ఇప్పటికే ప్రభుత్వంకు 65సార్లు మొట్టికాయలు వేసిన బుద్ధిరాలేదని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు అప్రజస్వామికముగా, హేతుబద్ధంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఇచ్చే ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు.

నిజంగా మూడు రాజధానిలకు ప్రజలను ఒప్పించి మీకు మెజారిటీతో గెలిపిస్తే ఇంకా ఏమి మాట్లాడమన్నారు. సైద్ధాంతికముగా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలని ప్రజలను మోసం, నమ్మకద్రోహం చేయవద్దని కోరారు.
 
బీజేపీ నాయకులు వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో తిరుపతి వెంకన్నగుడి కట్టే వరకు నా గెడ్డం తీయనని, చదువులేని వారికి ఉన్న బుద్ధి కూడా ఎమ్మెల్యేలకు లేదన్నారు. అమరావతిలో చాలామంది ఇన్వెస్ట్ చేశారని, వాటిని ఎవరు బరిస్తారన్నారు. ముఖ్యమంత్రి ఇన్వెస్టర్ల అప్పులు అన్ని కట్టి అప్పుడు వారి ఇష్టం వచ్చిన చోటికి రాజధాని తీసుకెళ్లవచ్చు అప్పుడు ఎవరూ అడ్డం పడరన్నారు.
 
లోక్ సత్తా నాయకురాలు నార్ల మాలతి మాలతి, డాక్టర్ యార్లపాటి శైలజ మాట్లాడుతూ మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే బాష అసభ్యకరంగా ఉందని అమరావతి సాధించే వరకు కలిసి పని చేస్తామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో రాజధాని రైతులు భోజనం చేసి నిద్ర పోయేలా తీర్పును ఇచ్చారన్నారు.

అమరావతి సాధనలో విజయము సాధిస్తామని ఈ 10 రోజులు కూడా ప్రభుత్వం కుట్రలను తిప్పుకొడతామన్నారు. సమావేశంలో సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ప్రజాప్రతినిధులకు ధైర్యం లేదు: బచ్చుల అర్జునుడు