Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేసేవాళ్లకు శిక్షలు చాలవు, ఆ ఆలోచనలే రాకుండా అలా చేయాలి: పవన్ కల్యాణ్

Advertiesment
pawan kalyan
, సోమవారం, 6 జూన్ 2022 (23:51 IST)
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. అడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించాలంటే శిక్షలు సరిపోవనీ, అసలు మగవారికి అలాంటి ఆలోచనలే రాకుండా ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని అన్నారు.

 
హైదరాబాదులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పవన్. పిల్లల ఒంటిపై ఎవరైనా దెబ్బ కొడితేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారనీ, అటువంటిది బాలికను ఓ సమూహం చుట్టుముట్టి చెరపడితే ఆ బాధితురాలితో పాటు ఆమె పేరెంట్స్ ఎంతగా కుమిలిపోతారో ఊహించనలవికాదు. 

 
ఈ దారుణ ఘటనకు కారకులైన వారు ఎంతటి పెద్దవారైనా శిక్షించాలని అన్నారు పవన్. అలాగే బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి సాయపడాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్‌ను షోయబ్ అఖ్తర్ చంపాలని ప్లాన్ చేశాడా, మరి తెందుల్కర్ ఎలా తప్పించుకున్నాడు?