Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం... విజయవాడలోనే...

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో ఇక్కడ సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కార్పొరేటర్ ఇంట్లో గుట్టు చప్పు

Advertiesment
టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం... విజయవాడలోనే...
, శనివారం, 19 ఆగస్టు 2017 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో ఇక్కడ సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కార్పొరేటర్ ఇంట్లో గుట్టు చప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విజయవాడ, ముత్యాలంపాడు జి.ఎస్‌.రాజు రోడ్డులో రెండునెలల క్రితం అన్నపూర్ణ, బొర్రా రామకృష్ణ అనేవారు నెల రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వారు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకు వచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌తో పాటు సత్యనారాయణపురం పోలీసులు ఇంటిపై ఆకస్మిక దాడి చేసి నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఈ వ్యభిచారగృహంలో పట్టుబడిన నలుగురు యువతులను రెస్క్యూ హోమ్‌కు పంపించారు.
 
సత్యనారాయణపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. కాగా వ్యభిచార ముఠాను అరెస్టు చేసిన ఇల్లు స్థానిక కార్పొరేటర్‌ది కావడం వివాదాస్పదమైంది. పోలీసుల దర్యాప్తులో కార్పొరేటర్‌కు అనేక ఇళ్లు ఉన్నాయని, ముఠాను అదుపులోకి తీసుకున్న ఇల్లు మూడు నెలల క్రితం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తామంటే అద్దెకు ఇచ్చారని చెబుతున్నారు. ఈ కార్పొరేటర్ ప్రముఖ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగిల్ చపాతీ తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి