Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

Advertiesment
Mohan Babu University Snatakothvam

చిత్రాసేన్

, బుధవారం, 8 అక్టోబరు 2025 (14:50 IST)
Mohan Babu University Snatakothvam
మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERWC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేయబడింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 
అవి కేవలం సిఫార్డులు మాత్రమేనని మరియు ఆ సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో సబ్-జ్యుడిస్) ఉన్నాయని దయచేసి గమనించగలరు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు. APHERMC యొక్క సదరు సిఫారులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా 'స్టే' ఉత్తర్వును హైకోర్టు వారు జారీ చేసి ఉండగా, APHERMC వారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం.
 
HER చేసిన సిఫార్డులు సరికాదని మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది మరియు ఈ విషయంపై విచారణ జరుపుతున్న గౌరవనీయ హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉంది.
 
విషయాన్ని తీవ్రతరం చేసి, విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజారడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియా మరియు మా భాగస్వాములందరికీ తెలియజేస్తున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి