ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం అనే అంశంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు వాదప్రతివాదనలను విన్న తర్వాత పవన్ కల్యాణ్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయాలలో వుంచరాదనే పిటీషన్‌ను కొట్టివేసింది.
డిప్యూటీ సీఎం ఫోటో ప్రభత్వ కార్యాలయాలలో వుండరాదని ఎక్కడైనా నిషేధం వుందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటీషన్లు వేసారని పేర్కొన్న కోర్టు పిటీషన్ డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ... సమాజానికి పనికివచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలంటూ చురకలు అంటించింది.