Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ 45 నిమిషాల పాటు అత్యంత పాశవికంగా నడుచుకున్న కామాంధులు

Advertiesment
Shad Nagar Case
, శనివారం, 30 నవంబరు 2019 (14:49 IST)
వైద్యురాలిపై అఘాయిత్యం చేసే క్రమంలో నలుగురు కామాంధులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. 45 నిమిషాల పాటు అకృత్యానికి పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దుండగులు బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారు. బాధితురాలు తన స్కూటీ కోసం వేచిచూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. 
 
ఆ సమయంలో బాధితురాలు ‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అని అరిచారు. వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఆమె వేదన అరణ్యరోదనే అయింది. తర్వాత దుండగులు వైద్యురాలి నోరు నొక్కి లాక్కెళ్లారు. కొంతసేపటికే స్కూటీ తీసుకొచ్చిన శివ వారికి జత కలిశాడు. 
 
అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై లైంగికదాడి చేశారు. బాధితురాలు ప్రతిఘటించకుండా మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. రాత్రి 10.20 గంటలవరకు ఈ రాక్షసకాండ కొనసాగించారు. అప్పటికే అచేతన స్థితిలోకి చేరుకున్న వైద్యురాలి నోరు, ముక్కును దుండగులు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
మృతదేహంపై అఘాయిత్యం..? 
సుమారు 30 నుంచి 45 నిమిషాలు నిందితులు వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. అంతటితో ఆగక నిందితులు మార్గమధ్యలో మృతదేహంపై పలుమార్లు దారుణానికి పాల్పడినట్లుగా తేల్చారు. ప్యాంటు లేకుండానే లారీ క్యాబిన్‌లోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు మళ్లీ కిందకెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్లుగా గుర్తించారు. 
 
ఘటనాస్థలిలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.కిరాతకుల్లో మైనర్‌ ఉన్నాడా..? నిందితుల్లో మైనర్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్లకు పైబడిన వారేనని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేయాలని, తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని మృతురాలి తండ్రి కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్దులగుట్ట వద్ద మహిళ మృతి కేసు దర్యాప్తు వేగవంతం