దేవాలయాల భూములు విక్రయిస్తే పోరాటానికి సిద్ధం: కన్నా

ఆదివారం, 24 మే 2020 (23:40 IST)
దేవాలయాల భూములు విక్రయిస్తే సహించేదిలేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.

భక్తులు కానుకగా ఇచ్చిన భూములను కాపాడటం చేతకావడంలేదా? అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. నిరర్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమని చెప్పారు.

ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదన్నారు. కరోనా హడావుడిలో అందరూ ఉంటే సింహాచలం భూములను కబ్జా చేశారని ఆరోపించారు.

సింహాచలం భూములను కబ్జాచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూముల పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ...మంగళవారం రోజున నిరసనలు చేపడతామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏపీలో రేపటి నుంచి 'మన పాలన - మీ సూచన' కార్యక్రమం..!!