విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గం: కన్నా

మంగళవారం, 19 మే 2020 (21:10 IST)
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కారణంగా ప్రజలందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గం అని పేర్కొన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని విమర్శించారు.

సహజంగానే ప్రజలు ఇళ్లలో ఉంటే విద్యుత్ వాడకం పెరుగుతుందని,  కానీ గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు రావడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

మార్చి నెలలో తాను రూ.11 వేల మేర విద్యుత్ బిల్లు చెల్లించానని, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందని వెల్లడించారు. ఇది విద్యుత్ చార్జీలు పెంచడం కాక మరేమిటి? అని ప్రశ్నించారు.

ఎంతో తెలివిగా విద్యుత్ స్లాబులు మార్చిన ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి