Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెస్ట‌హౌస్‌లో ప్రజాప్రతినిధి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.. ఎవరతను?

తెలంగాణా రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అతిథి గృహంలో రాసలీలలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిందిగా ఆయన అధికారుల కాళ్లా

గెస్ట‌హౌస్‌లో ప్రజాప్రతినిధి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.. ఎవరతను?
, శుక్రవారం, 19 మే 2017 (16:26 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అతిథి గృహంలో రాసలీలలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిందిగా ఆయన అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. అయితే, చివరకు ఈ విషయం బహిర్గతమైనప్పటికీ.. ప్రజాప్రతినిధి పేరును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఖమ్మం నగర సమీప మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఆ అతిథిగృహంలో పాడుపని చేస్తున్నట్టు ఆ కార్యాలయపు అధికారులు పసిగట్టారు. దీంతో ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఓ ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఎప్పటిలా ఖమ్మంకు వచ్చిన ఆ ప్రజాప్రతినిధి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. 
 
అతిథి గృహంలో రాసలీలలు కొనసాగిస్తున్న సమయంలో సదరు అతిథి గృహానికి బాధ్యులైన కీలక వ్యక్తే నేరుగా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి పరిశీలించినట్టు సమాచారం. కానీ ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న సదరు బాధ్యతగల వ్యక్తి.. ఆ ప్రజాప్రతినిధినికి చివాట్లు పెట్టి బయటకు పంపినట్టు వినికిడి. ఇకపై ఆయనకు గదులు ఇవ్వొద్దని కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. 
 
నిజానికి ఈ కార్యాలయానికి సంబంధించిన అతిథిగృహం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉండగా... ఇటీవలి ఘటనతో అది నిర్ధారణైంది. ‘కుదిరితే మందు.. విందు, మరో అడుగు ముందుకేస్తే అంతకుమించి’ కార్యక్రమాలు నెలలో చాలా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో మోసం.. పాప పుట్టాక దుబాయ్‌కి జంప్.. ఫోన్ చేస్తే చంపేస్తానన్నాడు..