ప్రేమ పేరుతో మోసం.. పాప పుట్టాక దుబాయ్‌కి జంప్.. ఫోన్ చేస్తే చంపేస్తానన్నాడు..
ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. అమ్మను చేశాడు. పాప పుట్టాక ఆమెను వదిలి దుబాయ్ చక్కేశాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెంలో చోటుచే
ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. అమ్మను చేశాడు. పాప పుట్టాక ఆమెను వదిలి దుబాయ్ చక్కేశాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అయితే దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోతు శ్యామల(25) సత్యభాస్కర్ ఇంటర్ కళాశాలలో చదువుతున్న సమయంలో స్థానిక ఇంతియాజ్ అలీతో పరిచయమైంది. శ్యామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకోకుండా కాపురం చేశాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆపై ఆమెను వదిలించుకునేందుకు దుబాయ్ వెళ్ళిపోయాడు.
దుబాయ్ వెళ్లిన తర్వాత కూడా కొంత కాలం ఫోన్‌లో మాట్లాడేవాడు. గత మూడేళ్లుగా ఫోన్ చేయకపోవడంతో పాటు తను ఫోన్ చేసినా తీయకుండా చంపేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు వాపోతోంది.