Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థుల తలలు పగులగొట్టిన పోలీసులు.. ఎక్కడ?

Advertiesment
Police Lathi Charge
, సోమవారం, 8 నవంబరు 2021 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల - పాఠశాల విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం నగరంలోని ఎస్‌బిఎన్‌ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. 
 
ప్రభుత్వ చర్యను విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించగా యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించి సంబంధిత పత్రాన్ని విద్యాశాఖాధికారులకు సమర్పించినట్లు తెలిసింది. పాఠశాలను ప్రైవేటీకరించిన పక్షంలో ఫీజుల భారం విద్యార్థులపై పడుతుందని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
 
విద్యార్థుల ఆందోళనతో ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను తొలగించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసుల మధ్య దాదాపు గంట పాటు తోపులాట జరిగింది.
 
అయితే, అక్కడ పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసుల లాఠీచార్జీ జరిపారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో వ్యభిచారం.. డిగ్రీ విద్యార్థినుల అరెస్టు