Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!

Advertiesment
amaravati capital

ఠాగూర్

, శుక్రవారం, 14 మార్చి 2025 (14:59 IST)
నవ్యాంధ్ర అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశముంది. 
 
తొలిదశలో రాజధానిలో నిర్మాణాలు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67,721 కోట్లు వెచ్చించనుంది. రూ.37,702 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీచేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులను ప్రారంభించనున్నాయి. 
 
బంగారు నగలు తుప్పుపట్టిపోతున్నాయ్... : గాలి జనార్థన్ రెడ్డి 
 
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తమ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న నగలు తుప్పు పట్టిపోతున్నాయని, వాటిని తిరిగి మాకిచ్చేయాలని కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. 
 
తమ ఇంటి నుంచి 53 కేజీల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని, ఇపుడు అవన్నీ తుప్పుపట్టిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి. కిరీటి రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే, వీరి పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టివేసింది. 
 
బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, వాటి విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసి, నేరపూరిత సొమ్ముతో కొనుగోలు చేసిన నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్ములవను తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mangaluru: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను ఢీకొన్న కారు.. తలకిందులుగా వేలాడుతూ.. (video)